అఖండ నుండి మరో సర్ప్రైజ్…ఎప్పుడంటే?

Wednesday, June 2nd, 2021, 08:30:55 AM IST

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం అఖండ. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో సింహ, లెజెండ్ చిత్రాలు వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాలు భారీ వసూళ్లను రాబట్టాయి. అయితే బాలకృష్ణ బోయపాటి తో సినిమా అనౌన్స్ అయినప్పటి నుండి సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు, ఫస్ట్ గ్లింప్స్ విడుదల అయిన సంగతి తెలిసిందే. తాజాగా టైటిల్ ను అనౌన్స్ చేస్తూ బాలయ్య నట విశ్వరూపం కన బరిచే విధంగా మరొక వీడియో విడుదల అయింది. ఆ వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.

అయితే మే 28 వ తేదీన ఈ చిత్రానికి సంబంధించిన ఒక అప్డేట్ రావాల్సి ఉండగా పలు కారణాల వలన వాయిదా పడింది. అయితే ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ తో పాటుగా టీజర్ విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు ముహూర్తం కూడా చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. బాలయ్య పుట్టిన రోజు అయిన జూన్ 10 వ తేదీన ఈ అప్డేట్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. అయితే ఈ చిత్రం లో బాలయ్య సరసన హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ నటిస్తుండగా మరొక కీలక పాత్ర లో పూర్ణ నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం తమన్ అందిస్తున్నారు.