ప్రమోషన్స్ లేకుండానే డైరెక్ట్ నెట్ ఫ్లిక్స్ లో సినిమా రిలీజ్ చేసిన సురేష్ ప్రొడక్షన్స్.!

Thursday, June 25th, 2020, 11:52:57 AM IST

ప్రస్తుతం లాక్ డౌన్ మూలాన పలు సినీ ఇండస్ట్రీలలో చిన్న తరహా బడ్జెట్ చిత్రాలు నేరుగా డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి వచ్చేస్తున్నాయి. హిందీ మరియు తమిళ్ నుంచి ఈ ట్రెండ్ ను ఎక్కువగా ఫాలో అవుతున్నాయి. కానీ మన తెలుగు సినిమా విషయానికి వస్తే కాస్త తక్కువే అని చెప్పాలి.

అలా తక్కువగా వచ్చిన వాటిలో లేటెస్ట్ చిత్రం “కృష్ణ అండ్ హిస్ లీల”. టాలెంటెడ్ నటుడు సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా “జెర్సీ” ఫేమ్ శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా ఈ చిత్రంలో నటించగా రవికాంత్ పేరపు దర్శకత్వంలో తెరకెక్కిన ఎంటర్టైనింగ్ చిత్రం ఇది.

ఎప్పుడో విడుదలకు నోచుకోవాల్సిన ఈ చిత్రం కరోనా దెబ్బ వలనే ఆగిపోయింది. మొత్తానికి ఈ చిత్రం ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ ద్వారా రిలీజ్ అయ్యింది. దీనితో పాటుగా సత్యదేవ్ నటించిన “ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య” కూడా నెట్ ఫ్లిక్స్ లోనే విడుదల కానుంది.