హాట్ టాపిక్ : “సర్కారు వారి పాట” లో విలన్ గా అరవింద్ స్వామి!?

Thursday, June 25th, 2020, 02:10:39 PM IST

మహేష్ బాబు తన కెరీర్ లో నిలిచిపోయే సినిమాలను చేస్తున్నారు. బ్లాక్ బస్టర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు మహేష్. అయితే మహేష్ బాబు తాజా చిత్రం అయిన సర్కారు వారి పాట సినిమా ప్రి లుక్ విడుదల అయిన సంగతి తెలిసిందే. టైటిల్ మరియు ఆ ప్రి లుక్ సినిమా పై అంచనాలను పెంచేసింది. మహేష్ బాబు మరొక బ్లాక్ బస్టర్ విజయం సాధించేందుకు సిద్దం అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రం కాస్ట్ విషయం లో మహేష్ పూర్తి స్థాయిలో శ్రద్ద కనబరుస్తున్నారు.

ఈ చిత్రం లో విలన్ పాత్ర కోసం అరవింద్ స్వామి ను సంప్రదించినట్లు సమాచారం. ఈ పాత్ర కోసం అరవింద్ భారీ మొత్తం తీసుకొనే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. ఈ సినిమా లో విలన్ పాత్ర హైలెట్ అని తెలుస్తోంది. రామ్ చరణ్ నటించిన ధృవ చిత్రం లో అరవింద్ స్వామి స్టైలిష్ గా ఉంటూ, హీరో పాత్రకు ఏ మాత్రం తగ్గకుండా చాలా బాగా చేశారు. అదే తరహాలో విలన్ పాత్ర చేసేందుకు చిత్ర యూనిట్ అరవింద్ స్వామి ను సంప్రదించినట్లు సమాచారం. అయితే ఇందుకు అరవింద్ స్వామి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

మహేష్ బాబు సరిలేరు నేకేవ్వరు చిత్రం తర్వాత పరశురామ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట చిత్రానికి సంగీతం తమన్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరి కొన్ని అప్డేట్స్ త్వరలో విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.