యూట్యూబ్ లో ‘బాహుబలి’ హల్ చల్!

Tuesday, June 2nd, 2015, 10:17:11 PM IST


టాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ‘బాహుబలి’ చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ప్రముఖ క్రియేటివ్ దర్శకుడు రాజమౌళి డైరెక్షన్ లో యువ కధానాయకులు ప్రభాస్, రాణా, కధానాయికలు అనుష్క, తమన్నా మొదలగు భారీ కాస్టింగ్ తో రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. ఇక ట్రైలర్ ను విడుదల చేసిన 24గంటల లోపే 10లక్షలకు పైగా దీనిని వీక్షించారంటే ఈ సినిమాపై ప్రజలకు ఎన్ని అంచనాలు ఉన్నాయో చెప్పకనే తెలుస్తోంది. అయితే రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రంలో తొలి భాగం ‘ది బిగినింగ్’ త్వరలో థియేటర్ లలో కనువిందు చెయ్యబోతోంది. ఇక ట్రైలర్ కూడా అంచనాలకు తగ్గట్టుగా రూపొందించడంతో సినీ అభిమానులు ఈ చిత్రం విడుదల కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.