ఇప్పటికీ నా డిమాండ్ అదే – నందమూరి బాలకృష్ణ

Friday, May 28th, 2021, 09:45:04 AM IST

mla_balakrishna

నేడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయనకి నివాళులు అర్పించారు. అయితే తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ను పాఠ్యాంశం గా తీసుకు రావాలని బాలకృష్ణ మరొకసారి డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ యుగపురుషుడు, పేదల పెన్నిధి అంటూ చెప్పుకొచ్చారు బాలయ్య. తన తండ్రి సినిమాలని చూసి స్ఫూర్తి పొందునట్లు చెప్పుకొచ్చారు. అయితే ఎన్టీఆర్ పై ఎంతోమంది పుస్తకాలు రాశారు అని, అయితే ఆయన జీవిత చరిత్రను విద్యార్థులకు పాఠ్యాంశం గా తీసుకు రావాలని తాను ఎప్పటి నుండో కోరుతున్నట్లు మీడియా సమావేశం లో పేర్కొన్నారు. అయితే ఇప్పటికీ అదే నా డిమాండ్ అంటూ బాలకృష్ణ వ్యాఖ్యానించారు.