బిగ్ వైరల్: బాలకృష్ణ BB3 “యానిమేటెడ్ టీజర్” అదిరిందిగా..!

Wednesday, June 24th, 2020, 01:41:04 AM IST


నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌్‌లో ముచ్చటగా మూడో సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఒక షెడ్యూల్ కంప్లీటైన తర్వాత కరోనా లాక్‌డౌన్ కారణంగా అన్ని సినిమాల మాదిరిగానే ఈ సినిమా షూటింగ్ కూడా వాయిదా పడిన సంగతి తెలిసిందే.

అయితే ఇటీవల బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా BB3 అంటూ విడుదల చేసిన ఫస్ట్ రోర్ టీజర్‌‌ దుమ్ముదురిపేసింది. మంచి మాస్ డైలాగ్స్, ఫైట్స్‌తో బాలయ్య, బోయపాటి మరో మార్క్ చూపించారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ యానిమేటెడ్ టీజర్ సోషల్ మీడియాలో తెగ అవైరల్ అవుతోంది. ఈ యానిమేటేట్ టీజర్‌ను ఎస్ఆర్ఏ 1 ఎంటర్టైన్మెంట్ వారు రూపొందించారు. ఏది ఏమైనా ఈ టీజర్ మాత్రం ఫ్యాన్స్‌ని తెగ ఆకట్టుకుంటుంది.