మర్డర్ చిత్రం పై అమృత ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు…క్లారిటీ ఇచ్చిన బాలస్వామి!

Monday, June 22nd, 2020, 03:10:26 PM IST

అమృతా ప్రణయ్ మారుతి రావు ల పై రామ్ గోపాల్ వర్మ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఫాదర్స్ డే సందర్భంగా టైటిల్ తో పాటుగా ఫస్ట్ లుక్ సైతం సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు వర్మ. అయితే ఈ చిత్రం పై అమృత పలు వ్యాఖ్యలు చేసినట్లు ఒక ప్రకటన సోషల్ మీడియా లో హల్చల్ చేస్తోంది. అయితే అది నిజం కాదు అని, అమృత మర్డర్ చిత్రానికి సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు అని ఆమె మామ బాలస్వామి స్పష్టం చేశారు. ప్రకటన లో రామ్ గోపాల్ వర్మ పై విరుచుకు పడుతూ చేసిన వ్యాఖ్యల పై తాజాగా రామ్ గోపాల్ వర్మ సైతం స్పందించిన సంగతి విదితమే.

రామ్ గోపాల్ వర్మ యదార్థ సంఘటనల మీద కల్పిత పాత్ర లతో చిత్రాన్ని తెరకెక్కస్తున్నారని వివరించారు. అయితే తాజాగా అమృత మామ బాలస్వామి చేసిన వ్యాఖ్యల తో ఇపుడు ఆ ప్రకటన ఎవరు విడుదల చేశారు అనే అంశం పై సర్వత్రా చర్చ లు జరుగుతున్నాయి. అమృతా భర్త ప్రణయ్ ను కిరాయి రౌడీలతో తన తండ్రి మారుతి రావు చంపించారు అని గతం లో పలు ఆరోపణలు చేశారు. అయితే ఆ కేసు లో మారుతి రావు ప్రధాన నిందితుడిగా జైలు లో కొంత కాలం ఉన్నారు. ఆ తర్వాత బెయిల్ పై వచ్చి కొద్ది రోజుల తర్వత ఒక హోటల్ లో ఆత్మ హత్య చేసుకున్నారు. అయితే ఈ నేపధ్యంలో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం పై ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు.