బండ్ల గణేష్ ఆసక్తికర ట్వీట్..పవన్ ను అనేంత సాహసం చేస్తారా..?

Thursday, July 2nd, 2020, 12:35:16 PM IST

టాలీవుడ్ ప్రముఖ నటుడు మరియు బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ సోషల్ మీడియాలో ఎంత ఆక్టివ్ గా ఉంటారో అందరికీ తెలిసిందే. అలాగే తాను పెట్టె ట్వీట్లు కూడా ఆసక్తికరంగా ఉంటాయి. అలా ఇప్పుడు తాను పెట్టిన ఓ ట్వీటే ఆసక్తికరంగా మారింది. ఒక ఫోటో పెట్టి ఇది నిజమా? అని ప్రశ్నించారు.

ఇంతకీ ఆ ఫొటోలో ఏముందంటే “ఈరోజుల్లో కష్టపడి పని చేసేవారి కంటే బాస్ కి భజన చేసే వారికి మంచి పేరు ప్రతిఫలం” అని ఉంది. ఇప్పుడు ఇదే ఆసక్తికరంగా మారింది. టాలీవుడ్ స్టార్ హీరో మరియు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు బండ్ల గణేష్ ఎంత కరుడు గట్టిన అభిమానో అందరికీ తెలుసు.

తాను వేరే పార్టీలో ఉన్నప్పటికీ పవన్ ను పల్లెత్తి ఒక్క మాట కూడా అనిన రికార్డు ఎక్కడా లేదు పైపెచ్చు ఇతర పార్టీల వారు ఎవరన్నా పవన్ ను అంటే ఊరుకునేవారు కూడా కాదు. అలా పవన్ ను తన బాస్ అంటూ నిరంతరం పొగుడుతూ ఆకాశానికి ఎత్తే బండ్ల గణేష్ ఇప్పుడు ఇలాంటి పోస్ట్ పెట్టడం ఆసక్తికరంగా మారింది. ఇది తన కోసం అని కానీ పవన్ కోసం అని కానీ కాకపోవచ్చు. కానీ అలా చిత్రీకరం అయ్యే చాన్సులు మాత్రం అధికంగా ఉన్నాయి. మరి బండ్ల ఈ ట్వీట్ ను ఎందుకు పెట్టారో ఆయనకే తెలియాలి.