ఉగాది కి బోయపాటి – బాలయ్య సినిమా టైటిల్ ప్రకటన

Sunday, April 11th, 2021, 06:27:53 PM IST

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరో గా నటిస్తున్న సరికొత్త సినిమా కి ఇంకా టైటిల్ ప్రకటించలేదు. బీబీ 3 అంటూ వర్కింగ్ టైటిల్ తో చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. సింహ, లెజెండ్ సినిమాల తో బోయపాటి శ్రీను బాలయ్య ను ఒక రేంజ్ లో చూపించారు. అయితే ఈ చిత్రం లో కూడా చాలా పవర్ ఫుల్ గా చూపిస్తున్నారు. బీబీ 3 రోర్ అంటూ విడుదల చేసిన టీజర్ కి భారీ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమా టైటిల్ పై త్వరలో క్లారిటీ రానుంది. చిత్ర యూనిట్ టైటిల్ ను ఉగాది పండుగ రోజున అనగా ఏప్రిల్ 13 వ తేదీన మధ్యాహ్నం 12:33 గంటలకు ప్రకటించనున్నారు. అయితే టైటిల్ తో పాటుగా పోస్టర్ లేదా వీడియో ను సైతం విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బాలకృష్ణ అభిమానులకు ఇది నిజంగా పండుగ లాంటి వార్త అని చెప్పాలి. ఈ చిత్రం లో ప్రగ్నా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, హీరో శ్రీకాంత్ సైతం కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం తమన్ అందిస్తున్నారు.