రివ్యూ ‘రాజా’ తీన్‌మార్ : భేతాళుడు – విజయ్ ఆంటోనీ మరోసారి మెప్పించాడు..!

Thursday, December 1st, 2016, 02:40:02 PM IST


తెరపై కనిపించిన వారు : విజయ్ ఆంటోనీ, అరుంధతి నాయర్

కెప్టెన్ ఆఫ్ ‘భేతాళుడు’ : ప్రదీప్ కృష్ణమూర్తి

మూల కథ :

దినేష్ (విజయ్ ఆంటోనీ) అనే ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మాసిక సమస్యతో భాధపడుతూ గత జన్మ గుర్తొచ్చి నానా భాధలు పడుతుంటాడు. ఆ క్రమంలోనే అతను జయలక్ష్మి అనే మహిళను వెతుక్కుంటూ వెళతాడు. అలా వెళ్లిన అతనికి తన గతం గురుంచి కొన్ని నిజాలు తెలుస్తాయి. ఆ నిజాలు ఏమిటి ? జయలక్ష్మి ఎవరు ? దినేష్ కు ఇఉన్నట్టుంది గతం ఎందుకు గుర్తొచ్చింది ? చివరికి ఆటను ఈ సమస్య నుండి ఎలా బయటపడ్డాడు ? అనేదే ఈ సినిమా కథ.

విజిల్ పోడు :

–> సినిమా ఫస్టాఫ్ ఆరంభం, కథనం, ఆంటోనీ జయలక్ష్మి పాత్రను వెతుక్కుంటూ వెళ్లే సన్నివేశాలు ఆసక్తికరంగా బాగున్నాయి. కాబట్టి ఇవన్నీ రాసిన, తెరపై చూపించిన దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తికి ఒక విజిల్ వెయ్యొచ్చు.

–> ఇక సెకండాఫ్ లో నడిచే ఆంటోనీ గత జన్మకు సంబందించిన కథ కూడా సహజంగా, ఆసక్తికరంగా బాగుంది. సులభంగా ప్రేక్షకుడికి కనెక్టవుతుంది. కనుక దీనికి రెండో విజిల్ వేసుకోవచ్చు.

–> అలాగే రెండు భిన్నమైన పాత్రల్లో ఆంటోనీ నటన అద్భుతంగా ఉంది. కథనంతో కలిసిపోయిన అతని నటన సన్నివేశాల్లోని తీవ్రతను పెంచింది. కనుక ఆంటోనీకి చివరి విజిల్ వేసుకోవచ్చు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

–> సినిమా సెకండాఫ్ ఆరంభం బాగానే ఉన్నా ప్రీ క్లైమాక్స్ లో ఉన్నట్టుండి కథ పూర్తిగా పక్కదారి పట్టడం బాగాలేదు. ప్రేక్షకుడికి ఏమాత్రం హెచ్చరిక లేకుండా అలా సినిమా మోడ్ నే మార్చేయడం నిరుత్సాహపరిచింది.

–> ఇక క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే చాలా రొటీన్ గా ఉండి ముందు నుండి ప్రేక్షకుడు ఆశించిన రీతిలో లేకుండా నిరుత్సాహపరిచింది.

–> అలాగే మధ్య మధ్యలో వచ్చే కొన్ని పాటలు ఫస్టాఫ్ కథనాకి అడ్డుపడుతూ బోర్ కొట్టించాయి.

ఇక సినిమా చూసిన ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు..

మిస్టర్ ఏ : సినిమా చాలా బాగుంది కదరా !
మిస్టర్ బి : అవునురా బాగేనా ఉంది. కానీ
మిస్టర్ ఏ : కానీ ఏంట్రా.. నచ్చలేదా.
మిస్టర్ బి : నచ్చిందిరా కానీ సెకండాఫ్ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్ లే నచ్చలేదు.
మిస్టర్ ఏ : అవునురా.. మొత్తం మీదే అవే నచ్చని అంశాలు.
మిస్టర్ బి : ఏది ఏమైనా నివ్వు చెప్పినట్టు సినిమా బాగానే ఉంది. పైసా వసూల్.