వకీల్ సాబ్‌ను చూసి జగన్ భయపడుతున్నాడు.. బీజేపీ నేత సంచలన ఆరోపణలు..!

Saturday, April 10th, 2021, 02:00:29 AM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అయితే ఏపీలో ఈ రోజు ఉదయం బెనిఫిట్ షోలు రద్దు చేయడంపై ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. బెనిఫిట్ షోల టికెట్లు విక్రయించి షో వేయకపోవడం ఆగ్రహం వ్యక్తం చేస్తూ థియేటర్లపై రాళ్లు విసిరారు. బెనిఫిట్ షోల రద్దుపై జనసేన, బీజేపీ నేతలు కూడా మండిపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం కావాలనే వకీల్ సాబ్ స్పెషల్ షోలను అడ్డుకుందని, ఖచ్చితంగా ఇది కక్షసాధింపు చర్యేనని ఆరోపిస్తున్నారు.

అయితే తాజాగా ఈ రోజు ఉదయం తిరుపతిలోని ఓ థియేటర్లో వకీల్ సాబ్ సినిమా చూసేందుకు వెళ్లిన బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జ్ సునీల్ దియోధర్ షోను క్యాన్సిల్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనన్ కళ్యాణ్‌కు ప్రజల్లో ఉన్న క్రేజ్‌కు భయపడి రాష్ట్రంలో బెనిఫిట్ షోలు రద్దు చేశారని, జగన్ ప్రభుత్వ ఆరాచకాలను, రౌడీయిజాన్ని ప్రశ్నిస్తున్నందుకు కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇలాంటి చీప్ టిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి శుక్రవారం నాంపల్లి కోర్టుకు వెళ్ళి హాజరు వెయ్యించుకునే అలవాటు ఉన్నవాడే కదా వకీల్ సాబ్‌ను చూసి భయపడేది అంటూ సునీల్ దియోధర్ ఎద్దేవా చేశారు.