బాలివుడ్ నటుడు సదాశివ్ కన్నుమూత

Monday, November 3rd, 2014, 10:27:36 AM IST


1984లో అర్ధ్ చిత్రంద్వారా చిత్రరంగ ప్రవేశం చేసిన.. నటుడు సదాశివ్ అమ్రాపుర్కర్ ఊపిరితిత్తుల వ్యాధితో ఆదివారం అర్ధరాత్రి ముంబైలోని కోకిలా బెన్ అంబానీ ఆసుపత్రిలో కన్నుమూశారు. అర్ధ్, ఆంఖే, కూలి నెం 1, ఇష్క్, గుప్త్ చిత్రాలలో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. అనంతరం ఆయన మరాఠి చిత్రాలపై దృష్టి సారించారు. 1984లో వచ్చిన అర్ధ్ సత్య, 1991లో వచ్చిన సడక్ చిత్రాలాలో అద్బుతమైన నటన కనబరిచి.. ఫిలిం ఫేర్ అవార్డులను సొంతం చేసుకున్నారు. 2012లో వచ్చిన బాంబే టాకీస్ ఆయన చివరి చిత్రం..

సదాశివ్ మరణం పట్ల పలువురు బాలివుడ్ నటులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.