నటి కేథరిన్ థెరిసా సోదరుడి ఆత్మహత్య

Friday, December 12th, 2014, 05:05:38 PM IST


ప్రముఖ టాలీవుడ్ నటి ‘ఇద్దరమ్మాయిలతో’ ‘పైసా’ సినిమాల కథానాయిక కేథరిన్ థెరిసా సోదరుడు క్రిస్టఫర్ ఆత్మహత్య చేసుకున్నారు. కాగా బెంగుళూరులోని మురుగేశ్ పాలియా ప్రాంతంలోని అతని నివాసంలో క్రిస్టఫర్ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇక ఆత్మహత్యకు ఆర్ధిక ఇబ్బందులే కారణమై ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. కాగా గత కొంతకాలంగా క్రిస్టోఫర్ కుటుంబానికి దూరంగా ఉంటూ చదువుకుంటున్నారు. ఇక సోదరుని మరణవార్త తెలియడంతో కేథరిన్ చెన్నై నుండి బెంగుళూరుకు చేరుకున్నారు.