‘చిరు, చరణ్’ సినిమాలు జనవరిలో డిసైడవుతాయి

Sunday, December 27th, 2015, 01:36:15 PM IST


గత కొంత కాలంగా ‘వరుణ్ తేజ్’ మినహాయిస్తే మెగా ఫ్యామిలీలో మిగతా హీరోల సినిమాల సందడి బాగా తగ్గింది. ముఖ్యంగా మెగా వారసుడు ‘రామ్ చరణ్’ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అలాగే చిరు 150వ సినిమా పై కూడా ఇప్పటి వరకూ ఓ ఖచ్చితమైన క్లారిటీ అనేది రాలేదు. కానీ 2016 జనవరిలో వీరి సినిమాలపై ఓ కన్ఫర్మేషన్ రావటమే గాక సినిమాలు కూడా మొదలయ్యే ఛాయలు కనిపిస్తున్నాయి. చిరు 150 వ సినిమా జనవరి ఆఖరి వారంలో అఫ్షియల్ కన్ఫర్మేషన్ ముగించుకుంటుందని అంతేగాకా ఫిబ్రవరి మధ్యలోకి సెట్స్ పైకి కూడా వెళ్తుందని వినికిడి.

ఇకపోతే బ్రూస్ లీ తరువాత డీలా పడ్డ ‘రామ్ చరణ్’ సినిమా కూడా జనవరి 16నాటికి అధికారికంగా అనౌన్స్ చేయబడనుంది. చరణ్ తమిళంలో సూపర్ హిట్టైన తనీ ఒరువన్ సినిమాని రీమేక్ చేయనున్న విషయం తెలిసిందే. అలాగే సినిమా ఫిబ్రవరిలో సెట్స్ పైకి కూడా వెళ్ళనున్నట్లు వినికిడి. మొత్తానికి 2016 జనవరి నెలాఖరుకు మెగా అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్న చిరు, చరణ్ సినిమాలపై ఓ క్లారిటీ ఖచ్చితంగా రానుంది.