ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా పై వచ్చిన క్లారిటీ

Thursday, February 11th, 2021, 09:05:39 AM IST

కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ చిత్రం తో ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు. కేజీఎఫ్ 2 టీజర్ సైతం అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రం షూటింగ్ అనంతరం దర్శకుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సలార్ చిత్రాన్ని వీలైనంత త్వరగా థియేటర్ల లోకి తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో మరొకసారి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా పై మళ్ళీ చర్చలు మొదలు అయ్యాయి.

ప్రశాంత్ నీల్ పుట్టిన రోజు సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ ఒక పోస్ట్ పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఎన్టీఆర్ పుట్టిన రోజు న కూడా ప్రశాంత్ నీల్ ఒక పోస్ట్ పెట్టీ సినిమా పై ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా ఉప్పెన ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఒక సినిమా రానున్నట్లు ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ విషయం తో ఎన్టీఆర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సినిమా చేస్తుండటం తో ఎన్టీఆర్ తో సినిమా చేస్తారా లేదా అనే ఒక అనుమానం ఏర్పడింది. అయితే తాజాగా ఉప్పెన ప్రమోశన్స్ లో ఒక క్లారిటీ రావడం పట్ల సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది.