దీపికా పదుకునే అరెస్ట్ పై స్టే!

Thursday, March 5th, 2015, 01:35:04 PM IST


ప్రముఖ బాలీవుడ్ నటీమణి దీపిక పదుకునే నేషనల్ స్పోర్ట్స్ క్లబ్ లో నిర్వహించిన ఆల్ ఇండియా బ్యాక్ హోడ్స్(ఏఐబీ) రోస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న కారణంగా ఆమెపై అరెస్ట్ వారెంట్ జారీ అయిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై దీపిక తాను కేవలం ఆ కార్యక్రమంలో ప్రేక్షకురాలినే తప్ప నటించడంగాని, ప్రదర్శన చెయ్యడం గాని చెయ్యలేదంటూ పిటీషన్ దాఖలు చేసింది. అలాగే తనపై పూణే, ముంబై తార్డో పోలీసు స్టేషన్లలో దాఖలైన ఎఫ్ఐఆర్ లను కొట్టి వెయ్యాలని దీపికా మరో పిటీషన్ ను దాఖలు చేసింది. ఇక దీనిపై విచారణ చేపట్టిన ముంబై హైకోర్టు దీపిక అరెస్ట్ పై ఈ నెల 16వ తేదీ వరకు స్టేను విధించింది.

కాగా 2014, డిసెంబర్ 20న జరిగిన ఏఐబీ రోస్ట్ కార్యక్రమంలో బాలీవుడ్ ప్రముఖులు కరణ్ జోహార్, రణవీర్ సింగ్, అర్జున్ కపూర్ లు పాల్గొని ప్రదర్శించారు. అయితే ఈ కార్యక్రమానికి బాలీవుడ్ హీరోయిన్ లు దీపికా పదుకునే, సోనాక్షి సిన్హా, ఆలియా భట్ లు ప్రేక్షకులుగా విచ్చేశారు. ఇక ఒక్క సోనాక్షి సిన్హా పై తప్ప ఇందులో పాల్గొన్న, హాజరైన అందరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి.