గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా హీరో నవీన్ కూమార్(అభయ్ భేతిగంటి) ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ ప్రముఖ యూట్యూబ్ యాంకర్ దేత్తడి హారిక నేడు జూబ్లీహిల్స్ లో మొక్కలు నాటి సెల్ఫీ దిగారు.
ఈ సందర్భంగా దేత్తడి హారిక మాట్లాడుతూ గ్రీన్ఇండియా కార్యక్రమాన్ని తలపెట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పెరుగుతున్న వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని మనందరం కూడా మొక్కలు నాటాలని కోరారు. అయితే తాను కూడా మరో ముగ్గురికి ఛాలెంజ్ ఇస్తున్నానని, ప్రముఖ యాంకర్ రవి, రేడియో జాకీ చైతు, సింగర్ సాకేత్ లను మొక్కలు నాటాలని పిలుపునిచ్చినట్లు తెలిపారు.