అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా ఎఫ్ 2 సీక్వెల్ కాదా!?

Tuesday, July 7th, 2020, 09:51:56 PM IST


మహేష్ బాబు తో సరిలేరూ నీకెవ్వరూ చిత్రాన్ని తెరకెక్కించి బ్లాక్ బస్టర్ విజయం సాధించిన దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ చిత్రం పై సరికొత్త ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎఫ్ 2 చిత్రం తో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ఈ దర్శకుడు ఈ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఎఫ్ 2 లో వెంకటేష, వరుణ్ తేజ్ లు నటించగా, ఈ ఎఫ్ 3 లో మరొక హీరో కూడా చేరే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అయితే స్క్రిప్ట్ పని పూర్తి అయినా, ఈ చిత్రాన్ని ఇపుడు అపుడే తెరకెక్కించే అవకాశాలు లేవని తెలుస్తోంది.

ఈ చిత్రం లో వెంకటేష, వరుణ్ తేజ్ లు నటించాల్స ఉండగా, వెంకటేష నారప్పా చిత్రం లో నటిస్తున్నారు. ఈ చిత్రం మళ్లీ పునః ప్రారంభం కావడానికి ఇంకా రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. అంతేకాక వరుణ్ తేజ్ సైతం మరో సినిమా లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ ఖాళీ సమయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి సద్వినియోగం చేసుకోవాలి భావిస్తున్నారు. ఒక యంగ్ హీరో తో కలిసి సినిమా చేసేందుకు ఈ దర్శకుడు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి నిర్మాత, సంగీత దర్శకుడు, హీరో, హీరోయిన్ వంటి విషయాలు తెలియాల్సి ఉంది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.