ఈసారి బౌండరీస్ దాటేస్తాం – కొరటాల శివ

Tuesday, April 13th, 2021, 09:49:48 AM IST

జూనియర్ ఎన్టీఆర్ 30 వ సినిమా పై ఒక క్లారిటీ వచ్చేసింది. ఎన్టీఆర్ తన 30 వ సినిమాను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ తో కన్ఫర్మ్ చేశారు. అంతకుముందు జనతా గ్యారేజ్ అంటూ అభిమానులను అలరించిన వీరి కాంబో ఈసారి మరింత పవర్ ఫుల్ గా రానుంది. అయితే ఈ సినిమా పై దర్శకుడు కొరటాల శివ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ తో మళ్ళీ కలిసి పని చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. చివరి సారిగా రిపేర్లు లోకల్, కానీ ఈసారి బౌండరీస్ దాటేస్తాం అంటూ చెప్పుకొచ్చారు.నందమూరి కళ్యాణ్ రామ్, యువసుధ ఆర్ట్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

అయితే దర్శకుడు కొరటాల శివ కి అభిమానులు ఒక సలహా ఇస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం దర్శకుడు గా అనిరుద్ రవిచందర్ ను తీసుకోవాలి అంటూ కొందరు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే మణిశర్మ అంటూ చెబుతున్నారు. అయితే ఎన్టీఆర్ ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పాటుగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా మరొక సినిమా చేయనున్నారు ఎన్టీఆర్. అయితే వాటి పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.