మన దేశంలోనే ఇన్ని డైరెక్ట్ సినిమాలను డైరెక్ట్ రిలీజ్ చేస్తున్న ఓటీటీ యాప్.!

Tuesday, June 30th, 2020, 11:38:28 AM IST

ప్రస్తుతం డిజిటల్ మార్కెట్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దానికి తోడు ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ ఉండటంతో అది మరింత స్థాయికి చేరుకుంది. దీనితో మనదేశంలో సినీ పరిశ్రమ కూడా చాలా దెబ్బతింది అదే సమయంలో అప్పటికే సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న అనేక సినిమాలు విడుదల ఆగిపోవాల్సి వచ్చింది దీంతో సినిమాలు విడుదల కావడానికి ఏకైక మార్గంగా ఓటి టి ప్లాట్ఫాం మాత్రమే కనిపించింది.

కానీ వీటిలో ఎక్కువగా విడుదలకు నోచుకుంది ఇది మాత్రం తమిళ్ మరియు బాలీవుడ్ సినిమాలే అని చెప్పాలి మన తెలుగులో కూడా కొన్ని చిన్న సినిమాలు విడుదలవుతున్నాయి కానీ బాలీవుడ్లో మాత్రం ఈ సారి ఏకంగా ఏడు సినిమాలు డైరెక్ట్ గా డిస్నీ హాట్ స్టార్ లో విడుదల కావడానికి రెడీ అవుతున్నాయి వీటిలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన కాంచన రీమేక్ లక్ష్మీ బాంబ్ కూడా ఒకటి.

అలాగే ఈ మధ్యనే బాలీవుడ్ లో విషాదం నింపిన టాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన చివరి సినిమా దిల్ బెచారా కూడా ఉంది ఈ అన్ని సినిమాలు కలిపి హాట్ స్టార్ వారు ఒక పోస్టర్ ను కూడ విడుదల చేశారు. ఇదే మన దేశంలో ఒక ఇండస్ట్రీ నుంచి ఇన్ని సినిమాలు ఒకేసారి ఒకే ప్లాట్ ఫాం లో రావడం అని చెప్పొచ్చు. మరి ఈ సినిమా లు ఎలా ఉన్నాయో తెలియాలి అంటే వీటిని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రీమియం లో చూడాల్సిందే.