మళ్ళీ నెంబర్ 1 స్థానానికి వచ్చేసిన ఈటీవీ షోలు.!

Thursday, June 25th, 2020, 02:55:39 PM IST

మొత్తానికి మళ్ళీ స్మాల్ స్క్రీన్ సీరియల్స్ మరియు షోలు షూటింగ్స్ మొదలయాయ్యి. కొన్ని నిబంధనలతో షూటింగ్స్ మళ్ళీ మొదలు కాగా అన్ని ఛానెల్స్ లో కన్నా మోస్ట్ అవైటెడ్ గా ఎదురు చూసే ఛానెల్ షోస్ ఏవన్నా ఉన్నాయి అంటే అవి ఈటీవీ షోస్ అని చెప్పాలి.

ఈటీవీ ఛానెల్లో ప్రసారం అయ్యే జబర్దస్త్, ఢీ మరియు క్యాష్ ప్రోగ్రాములు ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. కానీ లాక్ డౌన్ వల్ల గ్యాప్ బాగా వచ్చింది. కానీ ఎట్టకేలకు మళ్ళీ సరికొత్త స్టఫ్ తో ఈటీవీ వారు ముందుకొచ్చేవారు. అలాగే వీరి ప్రోమో వీడియోస్ కు యూట్యూబ్ లో ఎలాంటి రెస్పాన్స్ తెచుకుంటాయో తెలిసిందే.

ఆల్ టైం టాప్ ట్రెండింగ్ లో ఈ షోల తాలూకా ప్రోమోలు మళ్ళీ నిలిచాయి. వరుసగా నెంబర్ నుంచి నెంబర్ 5 వరకు అన్ని స్థానాల్లోనూ వీరి షోలే నిలిచాయి. దీనితో మొత్తానికి గ్యాప్ వచ్చినా సరే ఈటీవీ షోలు మళ్ళీ యథా స్థానానికి వచ్చాయని చెప్పాలి.