ప్రముఖ దర్శకుడు కే.వి. ఆనంద్ గుండెపోటు తో మృతి!

Friday, April 30th, 2021, 09:05:10 AM IST

కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు కే. వి ఆనంద్ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. గుండెపోటు తో చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి లో చేరిన ఆయన శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కే. వి ఆనంద్ మృతి తో తమిళ సినీ పరిశ్రమ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇటీవల ప్రముఖ నటుడు వివేక్ సైతం గుండెపోటు తో మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఇద్దరు ప్రముఖులు, గొప్ప వ్యక్తులు వెంట వెంటనే మరణించడం చిత్ర పరిశ్రమ కు తీరును లోటు అంటూ ప్రముఖులు అంటున్నారు. కేవలం తమిళ సినీ రంగానికి చెందిన వారు మాత్రమే కాకుండా, టాలీవుడ్ ప్రముఖులు, హీరోలు, నిర్మాతలు ఆనంద్ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు.

సినిమాటోగ్రఫర్ గా కెరీర్ ను 1994 లో ప్రారంభించిన ఆయన తెలుగు, తమిళం, మలయాళం మరియు బాలివుడ్ చిత్రాలకు పనిచేశారు. ప్రముఖ చిత్రాలు అయిన వీడొక్కడే, రంగం సినిమాలకు దర్శకుడు గా వ్యవహరించారు. అయితే కెమెరామన్ గా తెన్నావిన్ కొంబత్ చిత్రానికి జాతీయ అవార్డ్ సైతం అందుకున్నారు.