షూటింగులకు బ్రేక్ పడింది

Thursday, November 27th, 2014, 11:32:36 AM IST


తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సిని కార్మికుల సమాఖ్య బంద్ కు పిలుపునిచ్చింది. ఫిల్మ్ చాంబర్ తీసుకున్న కొత్త వ్యతిరేకంగా సిని కార్మికులు ఈ నిర్ణయం తీసుకున్నారు. తమకు వ్యతిరేకంగా ఎవరైనా షూటింగ్ లలో పాల్గొంటే… వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీంతో ఈ రోజు నుంచి నగరంలో షూటింగులు నిలిచిపోయాయి. చిన్న సినిమాలే కాకుండా పెద్ద సినిమాలకు సైతం దీని ఎఫెక్ట్ పడినట్టు తెలుస్తున్నది.

ఫిల్మ్ చాంబర్ తీసుకున్న కొత్త నిర్ణయాల కారణంగా తాము ఎంతగానో నష్టపోతామని…కాబట్టి వెంటనే తమకు వేతనాలు పెంచాలని సినికార్మిక సమాఖ్య డిమాండ్ చేస్తున్నది. సినికార్మిక సమాఖ్య ఇచ్చిన బంద్ లో దాదాపు 15వేల మంది కార్మికులు పాల్గొంటున్నారు. వీరంతా షూటింగ్ లను బహిష్కరించి బంద్ చేయడంతో… ఎక్కడ షూటింగులు అక్కడే ఆగిపోతున్నట్టు తెలుస్తున్నది.