గౌతమిపుత్ర ఫస్ట్ లుక్ .. సోషల్ మీడియాలో హల్ చల్

Thursday, June 9th, 2016, 03:17:29 PM IST


నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా గౌతమిపుత్రా శాతకర్ణి సినిమాకు సంబంధించిన ఫ్రీ లుక్ పోస్టర్ ను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో హల్ చల్చేస్తున్నది. ప్రస్తుతం బాలకృష్ణ అమెరికాలో బిజీగా ఉన్నారు. బసవతారకం హాస్పిటల్ కి సంబంధించిన పనుల గురించి బాలయ్య అమెరికన్ డెలిగేట్స్ తో చర్చలు జరుపుతున్నారు. ఇక, పుట్టిన రోజు వేడుకలను కూడా బాలయ్య అక్కడే జరుపుకోబోతున్నారు. మొరాకో షెడ్యూల్ ను ముగించుకున్న బాలకృష్ణ అక్కడి నుంచి ఇండియా వచ్చి.. తిరుపతిలో జరుగిన మహానాడు కార్యక్రమంలో హిందూపురం ప్రతినిధిగా పాల్గొన్నారు.

కాగ, బసవతారకం ట్రస్ట్ కు సంబంధించిన విషయమై బాలయ్య అమెరికా వెళ్లవలసి వచ్చింది. అమెరికా నుంచి వచ్చాక బాలకృష్ణ గౌతమీపుత్రా శాతకర్ణి మూడో షెడ్యూల్ లో పాల్గొంటారు. భారీ బడ్జెట్ తో, భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.