అఖండపై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందట..!

Saturday, May 22nd, 2021, 09:33:11 PM IST


నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌‌లో ముచ్చటగా మూడో సినిమాగా వస్తున్న అఖండపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అయితే ఆ అంచనాలను ఏ మాత్రం తలకిందులు చేయకుండా బోయపాటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్ రికార్డు స్థాయిలో వ్యూస్‌ను రాబ‌ట్టి మంచి టాక్ తెచ్చుకుంది.

అయితే తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఓ కీ అప్డేట్ ఒక‌టి ఫిలింన‌గ‌ర్ స‌ర్కిల్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఇందులో బాల‌య్య ఎంట్రీ ఎపిసోడ్‌ను సినిమాకే హైలెట్‌గా నిలిచేలా డిజైన్ చేశాడ‌ట బోయ‌పాటి. ఈ స్పెష‌ల్‌ ఎపిసోడ్ తో ప్రేక్ష‌కుల‌కు గూస్ బంప్స్ రావ‌డం ఖాయ‌మ‌ని చిత్రవర్గాలు భావిస్తున్నాయట. ఇక ఈ సినిమాలో శ్రీకాంత్‌, పూర్ణ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారట.