పుష్ప తర్వాత బన్నీ చేయబోయే సినిమా అదేనా?

Wednesday, April 14th, 2021, 09:37:50 AM IST

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రం లో అల్లు అర్జున్ పుష్పరాజ్ గా ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీ గా ఐదు బాషల్లో విడుదల కానుంది. అయితే పుష్ప చిత్రం తర్వాత అల్లు అర్జున్ ఏ దర్శకుడితో సినిమా చేస్తారు అనే దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఒక సినిమా ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. పుష్ప చిత్రం తర్వాత అల్లు అర్జున్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు అంటూ అంతా కూడా ఫిక్స్ అయ్యారు. అయితే ఊహించని విధంగా కొరటాల శివ తన నెక్స్ట్ చిత్ర ఎన్టీఆర్ తో అంటూ ప్రకటించేశారు. కొరటాల శివ ప్రస్తుతం ఆచార్య చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చూస్తున్నారు.

అయితే ఎన్టీఆర్ కొరటాల శివ చిత్రం పూర్తి అయ్యాక ఏప్రిల్ 2022 లో అల్లు అర్జున్ తో సినిమా మొదలు కానుంది. అయితే పుష్ప చిత్రం తర్వాత అల్లు అర్జున్ గ్యాప్ తీసుకుంటారా అనేది సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. అయితే వకీల్ సాబ్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు వేణు శ్రీరామ్ తో ఐకాన్ అనే సినిమాను అల్లు అర్జున్ చేయాల్సి ఉంది. అయితే ఈ సినిమా పట్టలెక్కనుందా అనేది కూడా చర్చంశనీయం అయింది. అయితే ఈ సినిమా పై కూడా త్వరలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి అల్లు అర్జున్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.