అప్పుడు పక్కన పెట్టి ఇప్పుడు లాక్కున్న త్రివిక్రమ్..?

Thursday, November 1st, 2018, 11:05:26 PM IST


టాలీవుడ్ లో త్రివిక్రమ్ అనే పేరుకి ఒక బ్రాండ్ ఉంది.సినిమా బాగోకపోయినా సరే ఆ తర్వాత మళ్ళీ చూస్తే అర్రే..బాగానే ఉంది కదా అనిపించేలా ఈయన చిత్రాలు ఉంటాయి.అయితే ఈ మధ్య వచ్చిన ”అజ్ఞ్యాతవాసి” చిత్రంతో మాత్రం త్రివిక్రమ్ మీద గట్టిగానే ప్రభావం చూపింది.అందరు గురూజీ పెన్నులో ఇంక్ అయ్యిపోయింది,త్రివిక్రమ్ పని ఇక అయ్యిపోయినట్టే అని పలు రకాల విమర్శలు చేశారు.అయితే పైకి విసిరిన రాయి రెట్టింపు వేగంతో కిందకి పడుతుంది అన్నట్టు త్రివిక్రమ్ చెప్పినట్టుగానే మళ్ళీ భారీ విజయాన్ని అందుకోడానికి కూడా త్రివిక్రమ్ కు ఎంతో సమయం పట్టలేదు.

అయితే “అజ్ఞ్యాతవాసి” చిత్రంతో తమిళ సంచలన సంగీత దర్శకుడు అనిరుద్ పరిచయం చేసిన త్రివిక్రమ్ తర్వాత ఎన్టీఆర్ తో తీసిన “అరవింద సమేత వీర రాఘవ” చిత్రానికి కూడా ఎంపిక చెయ్యడం జరిగింది.అయితే అజ్ఞ్యాతవాసి చిత్రం ఘోర పరాజయం పాలవడంతో ఎన్టీఆర్ తో సినిమాకు అనిరుద్ ని పక్కన పెట్టి థమన్ కి ఆ బాధ్యతలు అప్పగించారు,అవన్నీ ఇక గడిచిపోయాయి.ఇప్పుడు తాజాగా త్రివిక్రమ్ మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ఒక సినిమా మొదలు పెడుతున్నారని వార్తలొచ్చాయి.ఇప్పుడు వీరి సినిమాకి అనిరుద్ ని మళ్ళీ సంగీత దర్శకునిగా ఎన్నుకున్నట్టు తెలుస్తుంది.ఈ చిత్రం యొక్క షూటింగ్ వచ్చే నెల నుంచి మొదలవుతుందని తెలుస్తుంది.