RRR టీమ్ కి అలియా భట్ భయం పట్టుకుందా!?

Saturday, August 15th, 2020, 01:05:14 AM IST


ప్రస్తుతం బాలీవుడ్ లో నేపోటిజం అంటూ సోషల్ మీడియా లో నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా సడక్2 ట్రైలర్ విడుదల తో ఆ విషయం మరొకసారి నేపోటైజం పై చర్చలు జరుగుతున్నాయి. సుశాంత్ ఆత్మహత్య కి నేపోతిజం కారణం అంటూ ఇప్పటికే అభిమానులు ఆగ్రహం వ్యక్తంచేశారు వ్యక్తం చేస్తున్నారు. అలియా భట్ సడక్ 2 లో ఉండటం కారణం గా మోస్ట్ డిస్ లైక్డ్ ట్రైలర్ గా సడక్ 2 నిలిచింది. అయితే ఇది బాలీవుడ్ లో ఇక పై కొనసాగే లా కనిపిస్తుంది.

కొందరు సినిమాను కూడా చూడబోము అంటూనే, సడక్2 డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రానున్న విషయం తెలుసుకొని యాప్ ను అన్ ఇన్స్టాల్ చేస్తున్నారు. అయితే ఇపుడు ఆ భయం రాజమౌళి దర్శకత్వం లో రూపొందుతున్న రౌద్రం రణం రుదీరమ్ ను వెంటాడుతోంది అని కొందరు భావిస్తున్నారు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర లో నటిస్తుండగా, రామ్ చరణ్ కి జోడీగా ఈ చిత్రం లో అలియా భట్ కనిపించనున్నారు. అయితే ఈ చిత్రాన్ని కూడా సుశాంత్ అభిమానులు, నేపోటిసం కి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారు బోయ్ కాట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి చిత్ర యూనిట్ ఇందుకు ఎటువంటి ప్లాన్ అమలు చేస్తుందో చూడాలి.