చరణ్ – శంకర్ భారీ ప్రాజెక్ట్ జోనర్ ఇదేనా.?

Tuesday, February 16th, 2021, 03:34:54 PM IST

ఇటీవలే మళ్ళీ ఇండియన్ సినిమా వ్యాప్తంగా సెన్సేషనల్ రేపిన ప్రాజెక్ట్ ఏదన్నా ఉంది అంరే అది మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఇండియన్ జేమ్స్ కేమెరూన్ శంకర్ తో అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ అని చెప్పాలి. వీటికి ముందు కూడా కొన్ని సెన్సేషనల్ ప్రాజెక్ట్ కు ఉన్నాయి కానీ దీనికి మాత్రం వేరే లెవెల్ రెస్పాన్స్ వచ్చింది.

అయితే ఈ భారీ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలు అవుతుంది ఇతర అంశాలను పక్కన పెడితే అసలు ఈ చిత్రం ఎలాంటి జోనర్ లో తెరకెక్కుతుంది అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం దొరికేలానే తెలుస్తుంది. ఈ చిత్రానికి స్కై ఫై థ్రిల్లర్ లైన్ శంకర్ ఎంచుకున్నట్టు తెలుస్తుంది.

ఆ మధ్య శంకర్ తన బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ “2.0” టైం లోనే తాను మరో స్కై ఫై థ్రిల్లర్ కథను రాసుకున్నానని దానిని “ఇండియన్ 2” తర్వాత తీస్తానని తెలిపారు. మరి ఇదే చరణ్ తో తెరకెక్కస్తున్నారా లేదా వేరే కథా అన్నది తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.