నువ్వు నాకు అన్న మాత్రమే కాదు…ఎన్టీఆర్ భావోద్వేగ సందేశం!

Sunday, July 5th, 2020, 03:15:49 PM IST

నందమూరి తారక రామారావు తన సోదరుడు కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా ఒక సందేశాన్ని అందించారు. అయితే ఎన్నడూ తన అన్న గురించి భావోద్వేగం తో మాట్లాడే జూనియర్ ఎన్టీఆర్, మరొక సారి తన ప్రేమను చూపించారు. నువ్వు నాకు అన్న మాత్రమే కాదు, ఎన్నో ఏళ్లుగా స్నేహితుడు, మంచి తత్వవేత్త, మార్గ దర్శకుడివి, హ్యాపీ బర్త్ డే కళ్యాణ్ అన్న, నువ్వు నిజంగా బెస్ట్ అంటూ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా పలువురు సెలబ్రిటీలు , ప్రముఖులు, అభిమానులు విశేషంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఎన్టీఆర్ కి RRR చిత్రం లో కొమరం భీం పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా ఎన్టీఆర్ కి సంబందించిన ఫస్ట్ లుక్ లేదా వీడియో ఇప్పటి వరకు విడుదల కాలేదు. చిత్ర బృందం మాత్రం ఎంతగా ఎదురు చూసినా, అందుకు తగ్గట్లుగా అభిమానులను ఏ మాత్రం నిరాశ పరచదు అని తెలిపారు. అయితే అందుకోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.