“సర్కారు వారి పాట” లో కీర్తి సురేష్ పాత్ర ఇదేనట!

Wednesday, July 8th, 2020, 02:31:26 AM IST


తెలుగు సినీ పరిశ్రమ లో మహానటి చిత్రం తో కీర్తి సురేష్ ఎంతో పేరు ప్రఖ్యాత సంపాదించుకున్నారు. అందం, అభినయం తో అగ్ర కథానాయిక గా కొనసాగుతున్నారు. అయితే కీర్తి సురేష్ ఎట్టకేలకు మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రం లో నటించనున్నారు. అయితే ఈ చిత్రం లో కీర్తి సురేష్ పాత్ర పై ఇప్పటికే సోషల్ మీడియా లో చర్చలు మొదలయ్యాయి. అయితే ఈ చిత్రం లో కీర్తి ఒక బ్యాంక్ అధికారి పాత్రలో కనిించబోతున్నారు అని సమాచారం. అయితే దీని పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇప్పటికే గీతా గోవిందం చిత్రం తో బ్లాక్ బస్టర్ విజయం సాధించి మంచి ఊపు మీద ఉన్నారు దర్శకుడు పరశురామ్. అదే విధంగా వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో మహేష్ బాబు ఉన్నారు.ఈ ఏడాది సరిలేరు నీకేవ్వరు చిత్రం తో ప్రేక్షకులను అలరించిన మహేష్, ఇపుడు సర్కారు వారి పాట తో మీ ముందుకు రానున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రి లుక్ అభిమానులకు విపరీతంగా ఆకట్టుకుంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ చిత్ర షూటింగ్ వాయిదా పడింది. అయితే ఈ చిత్రానికి సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు.