కేజీఎఫ్ చాప్టర్2 తెలుగు రైట్స్ ను సొంతం చేసుకున్న దిల్ రాజు?

Tuesday, February 23rd, 2021, 09:30:12 PM IST

కేజీఎఫ్ చిత్రానికి దేశ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కన్నడ చిత్ర పరిశ్రమ కి తలమానికం గా నిలిచింది. కేవలం సౌత్ లో మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రభంజనం సృష్టించింది. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కేవలం టీజర్ తోనే ఈ చిత్రం చరిత్ర సృష్టించింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం తెలుగు హక్కులను 65 కోట్ల రూపాయలకి దిల్ రాజు దక్కించుకున్నట్లు టాలీవుడ్ లో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి.

అయితే ముందుగా కేజీఎఫ్ చిత్రాన్ని తెలుగు లో విడుదల చేసిన వారాహి సంస్థ, ఇప్పుడు ఆ అవకాశం కోల్పోయింది. కేజీఎఫ్ టీమ్ తెలుగు రైట్స్ ను ఎక్కువ మొత్తం ను కొట్ చేయడం తో వారాహి సంస్థ తప్పుకుంది. అయితే దిల్ రాజు ఆ భారీ మొత్తాన్ని దక్కించుకున్నారు అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం లో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ అధీర పాత్రలో విలన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సౌత్ కి చెందిన పలువురు ప్రముఖులు సైతం నటిస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.