రివ్యూ రాజా తీన్‌మార్ : ఖాకి – పోలీసులకు సెల్యూట్ చేయాలనిపించేలా ఉంది !

Friday, November 17th, 2017, 06:30:29 PM IST

తెరపై కనిపించిన వారు: కార్తి, రకుల్ ప్రీత్ సింగ్

కెప్టెన్ ఆఫ్ ‘ఖాకి ‘ : హెచ్.వినోత్

మూల కథ :
1995 కాలంలో తమిళనాడు హైవే పరిసరాల్లో వరుసగా దోపిడీ హత్యలు జరుగుతుంటాయి. ఆ కేసుకు సంబందించిన ఫైల్ అప్పుడే డిఎస్పీగా ఛార్జ్ తీసుకున్న ధీరజ్ (కార్తి) వద్దకు వస్తుంది. ఆ కేసు ఫైల్ చదివి ఆ దోపిడీ హంతకుల్ని పట్టుకోకపోతే ఇంకా ప్రజలు చనిపోతారని నిర్ణయించుకున్న ధీరజ్ ఇన్వెస్టిగేషన్ కు బయలుదేరుతాడు.

అలా విచారణ కోసం కొంతమంది టీమ్ తో కలిసి ప్రాణాలకు తెగించి దేశం మొత్తం తిరిగి కీలక ఆధారాలని సేకరిస్తారు ధీరజ్. వాటి ద్వారా కేసులోకి ఇంకాస్త లోతుగా వెళ్లి అసలు వాస్తవాల్ని కనుక్కుంటారు. ఆ వాస్తవాలు ఏంటి, ఆ దోపిడీ హత్యల వెనకున్న ముఠా ఎవరు, వాళ్ళ నైపథ్యం ఏమిటి , వాళ్ళను ధీరజ్ ఎలా పట్టుకున్నాడు అనేదే సినిమా. ఈ సినిమాను అప్పట్లో ఈ కేసును డీల్ చేసిన పోలీసుల చర్యల ఆధారంగానే రూపొందించారు .

విజిల్ పోడు :

–> దర్శకుడు వినోత్ నిజంగా జరిగిన ఒక కేసును తీసుకుని ఏదో పై పైనే కాకుండా చాలా లోతుగా పరోశోధన జరిపి అందులోని కీలక వ్యక్తుల గురించి, సంఘటనల గూరిచ్న్హి తెలుసుకుని రాసుకున్న కథ, కథనాలు చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాయి. మొదటి విజిల్ వాటికే వేయాలి.

–> దోపిడీ దొంగల తాలూకు వివరాల్ని తీసుకునే ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు, హంతకుల చిత్రాన్ని వివరించే సీన్లు, కార్తీ నటన బాగా ఆకట్టుకున్నాయి. ఈ అంశాలకి రెండో విజిల్ వేయొచ్చు.

–> ఇంటర్వెల్ ముందు 10 నిముషాల పాటు కొనసాగే ఒక సీక్వెన్స్ అలాగే సెకండాఫ్లోని యాక్షన్ సన్నివేశాలు, క్లైమాక్స్ ఎపిసోడ్ ఉత్కంఠగా ఉన్నాయి. కాబట్టి మూడో విజిల్ వాటికే వేయాలి.

ఢమ్మాల్ – డుమ్మీల్ :
–> దర్శకుడు వినోత్ కమర్షియల్ అంశాల కోసం సినిమాలో హీరోకి లవ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. ఫస్టాఫ్లో అది కాస్త ఎక్కువైనట్టు అనిపించింది.

–> సినిమాలో హీరో క్యారెక్టర్ బాగున్నా దానికి కొద్దిగా హీరోయిక్ టచ్ ఇచ్చి రెండు మూడు ఇంటెన్స్ సీన్లు పెట్టుంటే ఇంకా బాగుండేది.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..
–> ఈ సినిమాలో అంతగా ఆశ్చర్యానికి గురిచేసే అంశాలు, సన్నివేశాలు లేవు.

చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు..

–> మిస్టర్ ఏ : ఇన్వెస్టిగేషన్ అదిరింది కదా !
–> మిస్టర్ బి : అవును.. పోలీస్ పవర్ ఏంటో చూపించారు.
–> మిస్టర్ ఏ: సినిమా చూశాక అప్పటి పోలీసులకు సెల్యూట్ చేయాలనిపించింది.
–> మిస్టర్ బి : నాక్కూడ.