చిరు సినిమా లో కీలకంగా ఆ స్టార్ హీరోయిన్

Tuesday, June 30th, 2020, 12:15:20 PM IST

మెగాస్టార్ చిరంజీవి సినిమా చాన్నాళ్ల తర్వాత ఖైదీ 150 చిత్రం తో రీఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం తర్వాత కేవలం సైరా నరసింహ రెడ్డి చిత్రం చేశారు. ఈ చిత్రం అనంతరం వేగంగా సినిమాలు చేయాలని భావించారు చిరు. అందుకు తగ్గట్లుగానే ప్రణాళిక సిద్దం చేశారు. ఊహించని రీతిలో కరోనా వైరస్ కారణంగా ఆచార్య చిత్ర షూటింగ్ వాయిదా పడింది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ చిత్రం ఈ ఏడాది అక్టోబర్ లో విడుదల కావాల్సి ఉంది. అయితే లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా సంక్రాంతి కి విడుదల అయ్యే అవకాశం కనిపిస్తోంది.

అయితే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రం అనంతరం చిరు మరో ప్రాజెక్టు చేయనున్నారు. అందుకు సంబంధించిన పనులు సైతం వైగం గా పూర్తి చేస్తున్నారు. సా హో చిత్రం తో పాన్ ఇండియన్ డైరెక్టర్ గా ఎదిగిన సుజిత్ కి చిరు అవకాశం ఇచ్చారు. మోహన్ లాల్ నటించిన లూసీ ఫర్ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర రీమేక్ రైట్స్ ను కొనుగోలు చేసిన చరణ్, చిరు తో త్వరగా చిత్రీకరణ జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. సుజిత్ ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి స్క్రిప్ట్ ను కూడా చిరు కోరిన సూచనల మేరకు సిద్దం చేసినట్లు సమాచారం.

అయితే ఈ చిత్రం లో చిరు కి సోదరిగా ఒక పవర్ ఫుల్ లేడీ పాత్ర కోసం ముందుగా సుహాసిని అనుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ చిత్రంలో చిరు కి సోదరిగా అందాల తార ఖుష్బూ నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదివరకే ఈ హీరోయిన్ స్టాలిన్ చిత్రం లో చిరు తో నటించారు. మరోసారి ఈ బ్లాక్ బస్టర్ కంబో రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.