ప్రముఖ నటుడు వివేక్ కన్నుమూత..!

Saturday, April 17th, 2021, 07:43:20 AM IST


ప్రముఖ తమిళ హాస్యనటుడు వివేక్(59) కన్నుమూశారు. చెన్నైలోని నిన్న ఉదయం 11 గంటలకు వివేక్‌ గుండెపోటుతో చెన్నైలోని సిమ్స్ ఆస్పత్రిలో చేరారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఈ రోజు తెల్లవారు జామున 4:35 నిమిషాలకు మరణించినట్టు వైద్యులు తెలిపారు. అయితే వివేక్ మరణం పట్ల తమిళ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.

అయితే వివేక్ దాదాపుగా 300 లకు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. కె బాలచందర్ దర్శకత్వం వహించిన మనదిల్ ఉరుది వేండం సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. రజనీకాంత్‌, కమల్‌హాసన్, విజయ్‌, అజిత్ ఇలా దాదాపు పెద్ద హీరోలందరితోనూ వివేక్ నటించారు. ఆయన నటించిన తమిళ సినిమాలు తెలుగులోనూ వచ్చాయి. అపరిచితుడు, శివాజీ, రఘువరన్‌ బీటెక్, సింగం 2, బాయ్స్‌ వంటి సినిమాల్లో నటించారు.