నిజం ఎప్పుడూ ఒంటరిదే నందా…ప్రోమో లను విడుదల చేసిన చిత్ర యూనిట్

Sunday, April 11th, 2021, 04:38:57 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం విడుదల అయి బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రం పై ప్రముఖులు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా వకీల్ సాబ్ చిత్ర యూనిట్ ఈ చిత్రానికి సంబంధించిన పలు ప్రోమో లను విడుదల చేసింది. అయితే ఇందులో ఉన్నటువంటి డైలాగ్స్ ఇప్పుడు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. నిజం ఎప్పుడూ ఒంటరిదే నందా, కానీ దాని బలం ముందు ఎవరైనా తలోగ్గాల్సిందే అంటూ పవర్ ఫుల్ డైలాగ్ ప్రోమో ను విడుదల చేసింది. ఆడది అంటే వాడి బాత్రూమ్ లో గోడ మీద ఉండే బొమ్మ కాదు, వాడ్ని కనిపెంచిన అమ్మ కూడా అంటూ ఉండే మరో పవర్ ఫుల్ డైలాగ్ ప్రోమో ను సైతం విడుదల చేశారు.

అయితే బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన పింక్ చిత్రానికి రీమేక్ ఈ వకీల్ సాబ్. ఈ చిత్రం తో పవన్ కళ్యాణ్ మళ్ళీ మూడేళ్ల తర్వాత తెర పై కనిపించారు. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రం లో నివేతా థామస్, అంజలి, అనన్య లు కీలక పాత్రల్లో నటించారు. ప్రకాష్ రాజ్ ఒక పవర్ ఫుల్ పాత్రలో నటించారు. శృతి హాసన్ పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటించింది.