‘లింగా’ చిత్రం పైరసీ ముఠా గుట్టు రట్టు!

Saturday, December 13th, 2014, 09:29:26 AM IST


ప్రముఖ తమిళ సూపర్ స్టార్ తాజాగా నటించిన ‘లింగా’ సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే ఆ చిత్రానికి సంబంధించిన పైరసీ సీడీలు విడుదల అయి కలకలం రేపాయి. కాగా గుంటూరు జిల్లా వినికొండ కేంద్రంగా సాగుతున్న పైరసీ సీడీల తయారీ, విక్రయంపై సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేసి సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన 60వేలకు పైగా పైరసీ సీడీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటుగా పైరసీ సీడీల తయారీకి వినియోగిస్తున్న కంప్యుటర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ ముఠా ఆధ్వర్యంలో ‘లింగా’ సినిమానే కాక ప్రతి చిత్రానికి పైరసీ తయారుచేస్తున్నారని పోలీసులు తెలిపారు. అలాగే ఒక్క గుంటూరు జిల్లాలోనే కాక రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుండే పైరసీ సీడీలు వెళుతున్నాయని పోలీసులు వివరించారు.