ఉప్పెన సినిమాపై ప్రశంసలు కురిపించిన మహేశ్ బాబు..!

Monday, February 22nd, 2021, 11:00:33 PM IST

మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్‌, కృతి శెట్టి జంటగా బుచ్చిబాబు దర్శకత్వంలో నిర్మించిన ఉప్పెన సినిమా ఎన్నో అంచనాల మధ్య ఈ ఫిబ్రవరి 12న విడుదలై సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇప్పటికే పలు రికార్డులను కొల్లగొట్టిన ఈ సినిమాకు ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే తాజాగా ఉప్పెన సినిమాపై సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ సినిమా క్లాసిక్ అంటూ వన్ వర్డ్ కితాబు ఇచ్చాడు. ఇంత తక్కువ సమయంలో బుచ్చిబాబు ఇలాంటి సినిమా చేయడం నిజంగా గర్వ కారణం అని అన్నాడు.

అంతేకాదు ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మరో చక్కని సంగీతాన్ని అందించారని, కీప్ రాకింగ్ అంటూ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి ఇద్దరికి ఇది మొదటి సినిమా అయినప్పటికి చాలా అద్భుతమైన నటన కనబరిచారని అన్నారు. చివరగా సుకుమార్ మరియు మైత్రీ మూవీస్ ఇలాంటి మంచి సినిమాకు అండగా నిలవడం నిజంగా గర్వకారణం అని మహేశ్ అన్నారు.