రాజమౌళి కి కరోనా రావడం పై మహేష్ బాబు ఏమన్నారంటే!?

Thursday, July 30th, 2020, 02:46:39 AM IST

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అయితే రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సైతం ఈ వైరస్ భారిన పడుతున్నారు. తాజాగా దర్శక దిగ్గజం రాజమౌళి కి కరోనా వైరస్ సోకింది. ఈ విషయం ను స్వయంగా రాజమౌళి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే రాజమౌళి కి కరోనా వైరస్ సోకడం పట్ల అభిమానులు, ప్రేక్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే రాజమౌళి కి కరోనా రావడం పట్ల సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు.

జాగ్రత్తగా ఉండండి సార్ అంటూ రాజమౌళి కి సూచించారు. మీరూ, మీ కుటుంబ సభ్యులు త్వరగా ఈ మహమ్మారి భారీ నుండి కోలుకోవాలని కోరుకుంటున్నా అని అన్నారు. రాజమౌళి కరోనా వైరస్ నుండి కోలుకున్న అనంతరం ప్లాస్మా ఇచ్చేందుకు సైతం సిద్దం అయ్యారు. రాజమౌళి తీసుకున్న ఈ నిర్ణయం కి ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రౌద్రం రణం రుదీరం చిత్రం తెరకెక్కిస్తున్న అనంతరం మహేష్ బాబు తో ఒక సినిమా చేయాలని ఆలోచనలో ఉన్నట్లు ఇదివరకే తెలిపారు.