ఏపీ సీఎం వైఎస్ జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతిని శుక్రవారం తాడేపల్లిలో హీరో మంచు విష్ణు దంపతులు కలిశారు. ఈ సందర్భంగా వారితో కలిసి విష్ణు దంపతులు లంచ్ కూడా చేశారు. కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. అనంతరం జగన్తో సెల్ఫీ దిగిన విష్ణు ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. జగన్ అన్న, భారతి అక్కను కలిశామని, లంచ్ కూడా చేశామని తెలిపాడు. అయితే విద్య పట్ల ఆయనకున్న విజన్ మరోస్థాయి అంటూ ఇంకో విషయం ఏంటంటే ఆయనలోని హాస్య కోణాన్ని ప్రజలు మరింత తెలుసుకోవాలని కోరుకుంటున్నట్టు మంచు విష్ణు తెలిపారు.
ప్రస్తుతం వీరి సెల్ఫీ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇదిలా ఉంటే మంచు విష్ణు ప్రస్తుతం మోసగాళ్లు అనే సినిమా చేస్తున్నాడు. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో రూపొందిన ఈ చిత్రం తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాలో విష్ణుకు జోడీగా రుహీ సింగ్, అతడి సోదరిగా కాజల్ అగర్వాల్ నటించారు.