జయమ్మ పాత్రలో చక్కని నటన కనబరిచావు – మెగాస్టార్ చిరంజీవి

Monday, February 15th, 2021, 09:30:18 AM IST

వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవల కాలంలో టాక్ ఆఫ్ ది సెన్సేషన్ గా మారిపోయారు. రవితేజ తో కలిసి క్రాక్ లో నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం లో ప్రతినాయక పాత్రలో అలవోకగా నటించారు. అయితే ఈ చిత్రం పై అనేకమంది ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఈ పాత్ర పట్ల మెగాస్టార్ చిరంజీవి సైతం ప్రశంసల వర్షం కురిపించారు. ఆ విషయాన్ని వరలక్ష్మి తాజాగా ఒక ఇంటర్వ్యూ లో వెల్లడించారు. క్రాక్ చిత్రం లో జయమ్మ పాత్ర బావుంది అని నాన్నగారు గర్వంగా ఫీల్ అయ్యారు అని తెలిపారు. అంతేకాక మెగాస్టార్ చిరంజీవి తనకు ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలిపారు. జయమ్మ పాత్రలో చక్కని నటన కనబరిచావు, డబ్బింగ్ కూడా బావుంది అని అనడం తో చాలా సంతోషంగా అనిపించింది అని అన్నారు.

అయితే తెలుగు లో ప్రస్తుత నాంది చిత్రం విడుదల కి సిద్దం అవుతుంది. ఈ చిత్రం లో క్రిమినల్ లాయర్ గా కనిపిస్తున్నారు వరలక్ష్మి.ఆద్యా అనే ఈ పాత్ర చాలా ఛాలెంజింగ్ లా అనిపించింది అని అన్నారు. లాయర్ పాత్ర కావడం తో భారీ డైలాగ్స్ చెప్పాల్సి వచ్చింది అని, స్కూల్ పిల్లల్లాగా రాత్రిళ్ళు డైలాగ్స్ బట్టీ పట్టి ఉదయం షూటింగ్ కి వెళ్ళేదాన్ని అని అన్నారు.విభిన్న పాత్రల్లో నటించేందుకు నటుడు విజయ్ సేతుపతి తనకు స్ఫూర్తి అంటూ చెప్పుకొచ్చారు.