ఈ రేస్ నుంచి తప్పుకున్న మెగాస్టార్.!

Saturday, June 27th, 2020, 03:01:35 PM IST


ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” అనే చిత్రంలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే భారీ అంచనాలను నెలకొల్పుకున్నా ఈ చిత్రం షూటింగ్ మళ్ళీ మొదలవుతుంది అనుకుంటే హైదరాబాద్ ప్రాంతాల్లో కరోనా ధాటి ఎక్కువ అవుతుండడంతో అన్ని షూటింగులకు మళ్ళీ తాత్కాలిక బ్రేక్ పడింది.

అన్ని పరిస్థితులు బాగా ఉన్నట్టయితే ఈ చిత్రాన్ని ఈ దసరాకు కానీ లేక సంక్రాంతి రేస్ లో కానీ నిలపాలని మేకర్స్ భావించారు. కానీ ఇప్పుడు మళ్ళీ షూటింగ్ నిలిచిపోవడం ఇంకా చాలా వరకు సినిమా మిగిలి ఉండడంతో అనుకున్న సమయానికి సినిమా పూర్తి కాదు అందుకే ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ నుంచి తప్పుకున్నట్టుగా తెలుస్తుంది. మరి అక్కడ నుంచి ఈ చిత్రం వేసవి షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.