రివ్యూ ‘రాజా’ తీన్‌మార్ : నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ – లవ్ తక్కువ.. ఎమోషన్ ఎక్కువ !!

Friday, December 16th, 2016, 06:15:30 PM IST


రివ్యూ ‘రాజా’ తీన్‌మార్ : నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ – లవ్ తక్కువ.. ఎమోషన్ ఎక్కువ !!

తెరపై కనిపించిన వారు : హెబ్బా పటేల్, అశ్విన్, నోయెల్, పార్వతీశం(నూకరాజు)

కెప్టెన్ ఆఫ్ ‘ధృవ’ : భాస్కర్ బండి

మూల కథ :

కూతురి మీద అమితమైన ప్రేమ ఉన్న తండ్రి రావు రమేష్ తన కూతురు పద్మావతి(హెబ్బా పటేల్) కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చేస్తాడు. దాంతో పద్మావతి ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ముగ్గురు అబ్బాయిల్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళను ప్రేమిస్తుంది. వాళ్ళు కూడా ఆమెను ప్రాణంగా ప్రేమిస్తారు. కానీ చివరకు పద్మావతికి ఎవరిని పెళ్లి చేసుకోవాలో తెలీక డైలమాలో పడిపోతుంది. తనకు తెలీకుండా అంట పెద్ద పొరపాటు చేసిన పద్మావతిని తండ్రి ఎలా స్వీకరించాడు ? చివరికి పద్మావతిని ప్రేమించిన ఆ ముగ్గురు అబ్బాయిలు జీవితాలు ఏమయ్యాయి ? పద్మావతి ఎవరిని పెళ్లి చేసుకుంది ? అనేదే ఈ సినిమా ఈ కథ.

విజిల్ పోడు :

–> ఈ సినిమాలో మొదటి విజిల్ రచయితా సాయి కృష్ణ రాసిన డిఫరెంట్ అండ్ బోల్డ్ కథకు, దాన్ని బాగా హ్యండిల్ చేసిన దర్శకుడు భాస్కర్ బండి కి వేయాలి. ఒక అమ్మాయి ముగ్గురు అబ్బాయిల్ని ప్రేమించడం అనేది మన తెలుగు నేటివిటీకి ఓవర్ గా అనిపిస్తుంది. అలాంటి దాన్ని పాయింట్ ను అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా సినిమా తీయడం మెచ్చుకోదగ్గ విషయమే.

–> ఇక హీరోయిన్ తండ్రి పాత్రలో రావు రమేష్ నటన అద్భుతమని చెప్పాలి. కూతురిని గుడ్డిగా ప్రేమిస్తూ, ఆమె కోసం ఏమైనా చేసే తండ్రిగా ఆయన హావా భావాలు బాగున్నాయి. ఆ పాత్ర ద్వారా రచయితా ప్రసన్న కుమార్ పలికించిన ఎమోషనల్ డైలాగులు గొప్పగా ఉన్నాయి. కనుక వీటికి రెండవ విజిల్ వేసుకోవచ్చు.

–> సినిమా సెకండాఫ్ లోని ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్లలో హెబ్బా పటేల్, రావు రమేష్ ల పై నడిచే ఎమోషనల్ సన్నివేశాలు తండ్రి, కూతుళ్ళ మధ్య ఉండే అనుబంధాన్ని చాలా బాగా ఎలివేట్ చేశాయి. కనుక వాటికి చివరి విజిల్ వేసుకోవచ్చు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

–> సినిమా ఫస్టాఫ్ ఆరంభం బాగానే ఉన్నా పోను పోను కథనం రొటీన్ గా మారిపోతూ బోర్ కొట్టింది.

–> ఇక హీరోయిన్, ఆమె ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ మధ్య నడిచే కొన్ని లవ్ సీన్లు మరీ ఆర్టిఫీషియల్ గా ఉంటూ రొమాంటిక్ ఫీల్ ను లేకుండా చేశాయి.

–> దర్శకుడు సినిమాలో అన్ని అంశాలు ఉండాలనే ప్రయత్నం చేసినప్పటికీ చివరికి కాస్త లవ, ఎక్కువ ఫాదర్ ఎమోషన్ తప్ప కామెడీ, రొమాన్స్ వంటి వాటిని పండించడంలో విఫలమై నిరుత్సాహపరిచాడు.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..!

–> ఒక అమ్మాయి అనుకున్నదే తడవుగా ఈజీగా ముగ్గురు అబ్బాయిల్ని ఒకే చూపులో ప్రేమలో పడేయటమనేది చాలా అంటే చాలా వింతగా అనిపిస్తుంది.

–> ఎంత గొప్ప తండ్రైనా సరే తాన్ కూతురి ముగ్గురు అబ్బాయిల్ని ప్రేమించి నానా కష్టాలు కొని తెచ్చుకుంటే ఆమెను ఒక చిన్న మాట కూడా అనకపోవడం చిత్రమే మరి.

ఇక సినిమా చూసిన ఇద్దరు స్నేహితుల సంభాషణ ఇలా సాగింది..

మిస్టర్ ఏ : అరే సినిమా పర్లేదుకదరా ?
మిస్టర్ బి : అవున్రా.. నాక్కూడా అలానే అనిపించింది.
మిస్టేర్ ఏ : కానీ పోస్టర్ చూసి ఇదేదో బీభత్సమైన లవ్ స్టోరీ ఉంటుందని అనుకున్నాను. కానీ ఇక్కడ చూస్తే అంతా ఫాదర్ సెంటిమెంటే ఉంది.
మిస్టర్ బి : అందుకే కదరా పర్లేదు అని చెప్పింది.