రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ ఓ పిరియాడిక్ లవ్ స్టోరీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మహానటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నాగ్ అశ్విన్‌తో కూడా ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నాడు. సుమారు 400 కోట్ల బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మిస్తున్నారు.
అయితే సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందని అనుకున్నా ఎలాంటి అప్డేట్ రాకపోయే సరికి అభిమానులు నిరాశకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే తమ అభిమాన హీరో మూవీపై అప్డేట్ ఇవ్వండంటూ ప్రభాస్ ఫ్యాన్స్ వరుస ట్వీట్లు చేస్తున్నారు. దీంతో ఎట్టకేలకు నాగ్ అశ్విన్ మూవీ అప్డేట్పై స్పందించారు. ఖచ్చితంగా చెప్పాలంటే జనవరి 29న మరియు ఫిబ్రవరి 26న అప్డేట్స్ ఇస్తున్నట్టు తెలిపాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
Next Year Pongal Anukunta pic.twitter.com/sCcQDvg6JZ
— Pavan #SALAAR (@Pa1Prabhas45) January 22, 2021