రివ్యూ రాజా తీన్‌మార్ : నేను లోకల్ – నాని కోసం చూడొచ్చు!

Saturday, February 4th, 2017, 03:36:20 PM IST


తెరపై కనిపించిన వారు : నాని, కీర్తి సురేష్

కెప్టెన్ ఆఫ్ ‘నేను లోకల్’ : త్రినాథ రావ్ నక్కిన

మూలకథ :

విపరీతమైన యాటిట్యూడ్ తో జీవితాన్ని హ్యాపీగా గడిపే యువకుడు బాబు (నాని) ఎలాగోలా కష్టపడి బీటెక్ పాసై తర్వాత ఏం చెయ్యాలనే డైలమాలో ఉండగా కీర్తి (కీర్తి సురేష్) ని చూసి ప్రేమించి ఆమెనే తన నెక్స్ట్ గోల్ గా పెట్టుకుంటాడు. కీర్తి కూడా అతన్ని ప్రేమిస్తుంది. కానీ కీర్తి నాన్న మాత్రం వీళ్ళ ప్రేమకు ఒప్పుకోడు.

అదే సమయంలో బాబు ప్రేమకు పోలీస్ రూపంలో ఒక పెద్ద సమస్య ఎదురవుతుంది. ఆ సమస్య ఏమిటి ? బాబు దాన్ని ఎలా ఎదుర్కున్నాడు ? చివరికి కీర్తి నాన్నను బాబు కన్విన్స్ చేశాడా లేదా ? అసలు నాని యాటిట్యూడ్ ఎలా ఉంటుంది ? అనేదే ఈ సినిమా.

విజిల్ పోడు :

–> సినిమాలో నాని పాత్ర చిత్రీకరణ చాలా అద్భుతంగా ఉంది. ఎప్పుడూ ఒకేలా ఉంటూ, తనకు నచ్చింది చేస్తూ ఉండే కుర్రాడి పాత్రలో నాని నటన, చెప్పిన పంచ్ డైలాగులు చాలా బాగా కనెక్టయ్యాయి. వీటికి మొదటి విజిల్ వేసుకోవచ్చు.

–> ఇక దర్శకుడు త్రినాథరావ్ నక్కిన మంచి ఫన్ తో ఫస్టాఫ్ ను సరదాగా తయారు చేసి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. ఇంటర్వెల్ లో కూడా మంచి ట్విస్ట్ ఇచ్చి ఆసక్తిని పెంచాడు. కనుక దర్శకుడికి, సినిమా ఫస్టాఫ్ కి కలిపి రెండో విజిల్ వేసుకోవచ్చు.

–> హీరోయిన్ కీర్తి సురేష్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. నానితో కలిసి ఆమె పోటా పోటీగా నటించింది. వీరిద్దరి కలయిక మంచి రొమాంటిక్ ఫీల్ ను అందించింది. దేవి శ్రీ పాటలు కూడా బాగున్నాయి. కనుక వీరి జంటకు, దేవి శ్రీ సంగీతానికి మూడో విజిల్ వేసుకోవచ్చు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

–> సినిమాలో పెద్ద ఢమ్మాల్ అంటే చెప్పుకోవలసింది సెకండాఫ్ గురించి. ఇందులో మొదటి భాగంలో ఉన్నంత ఫన్ లేదు. చాలా సాదా సీదాగా ఉండి సినిమాకి కాస్త డ్రా బ్యాక్ గా నిలిచింది.

–> ఇక చిత్ర కథ కూడా చాలా పాతదే అవడం, హీరో పాత్ర తప్ప మిగతా అంతా రొటీన్ గానే ఉండటం నిరుత్సాహపరిచింది.

–> ఇక ఫస్టాఫ్, సెకండాఫ్ లలో కొన్ని అనవసర సన్నివేశాలు, సాగదీయబడ్డ ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ కాస్త విసిగించాయి.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..!

–> హీరో తల్లిదండ్రుల పాత్రల స్వభావం కాస్త ఓవర్ గా ఉండటం మినహా ఇందులో అంత పెద్ద వింతలేమీ లేవు.

చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితుల సంభాషణ ఇలా ఉంది..

మిస్టర్ ఏ : సినిమా బాగుంది కదరా. హ్యాపీగా చూడొచ్చు.
మిస్టర్ బి : అంత లేదులే బాబు.
మిస్టర్ ఏ: ఏం సినిమా నచ్చలేదా.
మిస్టర్ బి : నచ్చింది. నాని పెర్ఫార్మెన్స్, ఫస్టాఫ్ ఫన్.
మిస్టర్ ఏ : అయితే ఏమంటావ్ ?
మిస్టర్ బి : కొత్త కథనేది లేదు కాబట్టి నాని కోసం మాత్రమే చూడొచ్చంటాను.