ప్రశాంత్ నీల్ కి ఎన్టీఆర్ బర్త్ డే విషెస్

Friday, June 4th, 2021, 01:47:43 PM IST


జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో లో ఒక సినిమా రానున్న సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ ఈ చిత్రం లో ఎలా ఉండబోతున్నాడు అనేది ఇంకా తెలియాల్సి వుంది. అయితే నేడు ప్రశాంత్ నీల్ పుట్టిన రోజు సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్ డే బ్రదర్ ప్రశాంత్ నీల్ అంటూ చెప్పుకొచ్చారు. ఎప్పుడూ అదే విధంగా అద్భుతంగా ఉండండి అంటూ చెప్పుకొచ్చారు. అయితే తనతో సినిమా చేసేందుకు ఎన్టీఆర్ ఎదురు చూస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపిన పోస్ట్ పై మైత్రి మూవీ మేకర్స్ స్పందిస్తూ, ఎన్టీఆర్ 31 అంటూ ఫైర్స్ సింబల్ తో కామెంట్స్ చేశారు. అయితే దీని పై అభిమానులు స్పందిస్తున్నారు.

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా కి సంబందించి అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఒక పక్క ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ చిత్రం తో బిజీ గా ఉన్నారు. మరొక పక్క జూనియర్ ఎన్టీఆర్ సైతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌద్రం రణం రుధిరం చిత్రం లో కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. మరొక కథానాయకుడు రామ్ చరణ్. అయితే ఎన్టీఆర్ మరో రెండు చిత్రాలతో బిజీ కానున్నారు. ఈ చిత్రాల అనంతరం వీరిద్దరూ కలిసి పని చేసే అవకాశం ఉంది.