కొమురం భీమ్ పాత్ర గురించి ఎన్టీఆర్ ఏమన్నారంటే?

Thursday, May 20th, 2021, 12:03:27 PM IST


జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రౌద్రం రణం రుధిరం చిత్ర యూనిట్ ఒక రెబల్ పోస్టర్ ను విడుదల చేసింది. ఎన్టీఆర్ బల్లెం పట్టుకొని గురి పెట్టినట్లుగా ఉన్న పోస్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. అయితే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం దాదాపు పూర్తి కావచ్చింది. అయితే నేడు ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రాజమౌళి పోస్టర్ విడుదల చేస్తూ “భీమ్ ది బంగారం లాంటి మనసు, కానీ తిరుగుబాటు చేస్తే బలంగా, ధైర్యం గా నిలుస్తాడు” అంటూ చెప్పుకొచ్చారు. అయితే కొమురం భీమ్ పాత్ర పై జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

భీమ్ హృదయం తో నిండిన తిరుగుబాటు దారుడు అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. అయితే భీమ్ పాత్రను పోషించడం చాలా ఆనందం గా ఉందని పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకూ తను పోషించిన అతి పెద్ద సవాళ్ల లో ఒకటైన కొమురం భీమ్ పాత్రను పరిచయం చేయడం ఆనందం గా ఉందని పేర్కొన్నారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ నుండి కోమురం భీమ్ అంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. అయితే ఈ చిత్రం లో మరొక కథానాయకుడు గా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం లో అలియా భట్, ఒలివియా మోరిస్ లు కథానాయికలు గా నటిస్తుండగా, అజయ్ దేవగన్, శ్రియ శరణ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.