జూనియర్ ఎన్టీఆర్ కి కరోనా నెగటివ్

Tuesday, May 25th, 2021, 11:45:31 AM IST

ఇటీవల కరోనా వైరస్ భారిన పడిన ఎన్టీఆర్ తాజాగా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించుకున్నారు. అయితే ఫలితాల్లో కరోనా వైరస్ నెగటివ్ అని తేలింది. అయితే ఈ విషయాన్ని ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. కరోనా వైరస్ నెగటివ్ వచ్చిన విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. మీ అందరి విషెస్ కి కృతజ్ఞతలు అంటూ చెప్పుకొచ్చారు. అయితే కరోనా వైరస్ నుండి కోలుకోవడానికి కారకులు అయిన డాక్టర్ ప్రవీణ్ కులకర్ణి కి, మరియు కిమ్స్ లో చేస్తున్న డాక్టర్ వీరు కి ధన్యవాదాలు తెలిపారు. అయితే కరోనా వైరస్ ను చాలా సీరియస్ గా తీసుకోవాలని, అయితే చాలా జాగ్రత్తగా, సేఫ్ గా ఉండటం ద్వారా దీన్ని అధిగమించవచ్చు అని వ్యాఖ్యానించారు. ఆత్మబలం అన్నిటికంటే కూడా అతి పెద్ద ఆయుధం అంటూ చెప్పుకొచ్చారు. బలంగా ఉండండి, కంగారు పడకుండా ఉండండి అంటూ సూచించారు. మాస్క్ ధరించండి, ఇంట్లోనే ఉండండి అంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

అయితే ఎన్టీఆర్ కి కరోనా వైరస్ నెగటివ్ అని తేలడం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాస్క్ ధరించి ఇంట్లోనే ఉందాం అంటూ చెప్పుకొస్తున్నారు.