మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ కోసం తమన్నా.!

Thursday, June 25th, 2020, 06:40:56 PM IST

ప్రస్తుత రోజుల్లో డిజిటల్ స్ట్రీమింగ్ రంగం ఎంతలా అభివృద్ధి చెందిందో మనం చూస్తూనే ఉన్నాము. ముఖ్యంగా ఈ లాక్ డౌన్ లో అయితే డిజిటల్ యాప్స్ వాడకంలో మరింత గ్రాఫ్ పెంచుకున్నాయి. అయితే వీటన్నిటికీ పోటీగా మన తెలుగు నుంచే వచ్చిన డిజిటల్ స్ట్రీమింగ్ యాప్ “ఆహా”.

గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ తెలుగులో ప్రవేశ పెట్టిన ఈ స్ట్రీమింగ్ యాప్ ఇప్పుడు మన తెలుగులో దూసుకెళ్తుంది. ప్యూర్ గా తెలుగు వెబ్ సిరీస్ లు మరియు కొత్త సినిమాలతో ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న ఈ స్ట్రీమింగ్ యాప్ ఒక సరికొత్త టాక్ షో ను పరిచయం చేయనున్నారట.

అందుకు గాను స్టార్ హీరోయిన్ తమన్నాను సంప్రదించినట్టు తెలుస్తుంది. అంతే కాకుండా ఈ షోకు గాను తమన్నా పెద్ద మొత్తంలోనే రెమ్యునరేషన్ అందుకుందట. మరి ఈ షో ఎలా ఉండనుందో చూడాలి.