సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా పరాజయం తరువాత పవన్ కళ్యాణ్ మరో సినిమాకు సిద్దమవుతున్నారు. 2001లో ఖుషి వంటి బ్లాక్ బస్టర్ సినిమాకు దర్శకత్వం వహించిన ఎస్ జె సూర్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సినిమా కన్ఫామ్ చేశారు. సర్దార్ షూటింగ్ లో ఉండగానే దీనికి సంబంధించిన చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. సర్దార్ గబ్బర్ సింగ్ కు నిర్మాతగా వ్యవహరించిన శరత్ మరార్.. ఇప్పుడు పవన్.. సూర్య సినిమాకు కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకత్వంలో సాంగ్స్ సిట్టింగ్స్ కూడా ప్రారంభమయ్యాయట. హరి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందిస్తున్నారు.
ఇక, ఇదిలా ఉంటె, ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతున్నట్టు సమాచారం. ఈ సినిమా కథను బట్టి హుషారు అనే టైటిల్ ను అనుకుంటున్నారని సమాచారం. అంటే సర్దార్ తరువాత పవన్ కళ్యాణ్ హుషారుగా మనముందుకు వస్తాడన్నమాట.